గత ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు: ఎమ్సెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం కోం ప్రజలను చైతన్యపర్చిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమ కారుల  ఆకాంక్షలు నెరవేరలే దన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ ఉద్యమకారులు, విశ్రాంత ఉద్యోగులు, కొందరు బీఆర్ ఎస్ నేతలు. 

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచేందుకు తెలంగాణ ఉద్యమకారులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీఆర్ఎస నేతలు కాంగ్రస్ లోచేరారని అన్నారు. ప్రజల అండతో ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగువ వేస్తామన్నారు. పదవి, హోదా శాశ్వతం కాదు..రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ప్రజలకోసం పనిచేశానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.