రాజీవ్‌ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

రాజీవ్‌ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
  •  రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌  
  •  గేట్స్​ తెరిచినప్పుడు మోదీ ఎక్కడున్నడు

హైదరాబాద్​: రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్‌గాంధీ అని, గేట్స్ తెరిచినప్పుడు మోదీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ వస్తే రామాలయాన్ని  బుల్డోజర్‌తో కూల్చేస్తారని మోదీ ప్రచారం దారుణమన్నారు.  ఎన్నికల నియమావళిని మోదీ  ఉల్లంఘించారని మండిపడ్డారు.  మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం మంచిదికాదన్నారు. మత సామరస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుల్డోజర్‌ను తెర మీదకు తీసుకువచ్చింది బీజేపీనే అని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు దూరదర్శన్‌లో రామాయణ, మహాభారతాలు ప్రసారం చేశారని తెలిపారు.  మోదీ వచ్చాకే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోర్టు తీర్పు ప్రకారమే రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీ దేశాన్ని నాశనం చేస్తోందని జీవన్‌రెడ్డి ఫైర్​మండిపడ్డారు.