ఇవే నాకు చివరి ఎన్నికలు:ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ఆశీర్వదించి గెలిపించండి
నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: ‘వచ్చే పార్లమెంట్ ఎన్నికలే నాకు చివరివి, జగిత్యాల ప్రాంతానికి నేను చేసిన సేవలు గుర్తించి నన్ను ఆశీర్వదించండి’ అని నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. శనివారం జగిత్యాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాదిరిగానే జాతీయ స్థాయిలో కూడా మార్పు రాబోతుందని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీ అరవింద్ ఎక్స్‌పైరీ అయిపోయిన మెడిసిన్ అన్నారు. వరంగల్ తర్వాత జగిత్యాల జిల్లాలోనే విద్యా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. నిజామాబాద్‌లో ఇప్పటివరకు మహిళా డిగ్రీ కాలేజీ లేదని చెప్పారు. బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. జాతీయవాదానికి మారుపేరు కాంగ్రెస్ అని చెప్పారు.