జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో నిరసన విరమించాలని ఎస్పీ అశోక్ కుమార్ జీవన్ రెడ్డిని కోరారు. దీంతో.. మమ్మల్ని వదిలేయండి.. జగిత్యాలకు మాకు ( కాంగ్రెస్ కార్యకర్తలకు) రక్షణ లేదంటూ ఎస్పీకి జీవన్ రెడ్డి దండం పెట్టారు.
మారు గంగారెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్నాలో కూర్చున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు.అయితే గ్రామంలోని రాజకీయ కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.