జగిత్యాల టౌన్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, టీచర్ల సంక్షేమమే ధ్యేయంగా పాత పెన్షన్పునరుద్ధరణపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు చెప్పారు.
అనంతరం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకి బొకే ఇచ్చి విషెష్తెలిపారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, రమేశ్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చుతాం
పెగడపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్‌ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ బిల్డింగ్‌ను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్యాస్మిన్బాషాతో
కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలుచేశామని, మిగతావాటికి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.