అలకవీడిన జీవన్ రెడ్డి.. ఫలించిన బుజ్జగింపులు

అలకవీడిన జీవన్ రెడ్డి.. ఫలించిన బుజ్జగింపులు

 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలుచేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఐక్యంగా కలిసి పనిచేయాలని అధిష్టాన పెద్దలు సూచించారని ఆమేరకే వెళ్తానని తెలిపారు.  బీఅర్ఎస్ పూర్తిస్థాయిలో రుణమాఫీ చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ  ఏకకాలంలో అమలు చేయడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియామకం అవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమలుకాని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ఏ పార్టీ కైనా కార్యకర్తలే ముఖ్యమని వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.  

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం చూస్తే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని  విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూసారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోందని తెలిపారు.