జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా రేచపల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. ఆదివారం జగిత్యాల నుంచి రేచపల్లికి ఏర్పాటు చేసిన బస్సులో ఆయన ప్రయాణించారు.
గ్రామానికి బస్సు రావడంతో రేచపల్లి వాసులు సంబురాలు జరుపుకున్నారు. గతంలో ఈ గ్రామానికి ఉన్న బస్సును అధికారులు నిలిపివేయగా, ఆదివారం తిరిగి ప్రారంభించారు.