అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి : జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి : జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • కలెక్టర్ కు ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి లేఖ 

జగిత్యాల టౌన్, వెలుగు:  జగిత్యాల పట్టణంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గురువారం జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు. పట్టణంలోని 4వ వార్డులలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తన  దృష్టికి వచ్చిందని లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల అనుమతులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ప్రమోషన్లలో బీఈడీ వారికి అవకాశం ఇవ్వాలి 

బీఈడీ చేసిన టీచర్లకు పీఎస్ హెచ్ఎం ప్రమోషన్లలో పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. గతంలో డిగ్రీ, బీఈడీ వారికి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ప్రమోషన్లలో అవకాశం ఇవ్వగా ఈ సారి కేవలం డీఈడీ ఉన్న సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్లనే పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

తాగునీటి ఎద్దడి నివారణకు కృషి

రాయికల్​, వెలుగు: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి  అన్నారు. రాయికల్​ మండలం కుమ్మరిపెల్లి, రాయికల్​ పట్టణంలో గురువారం ఆయన పర్యటించారు. కుమ్మరిపెల్లి గ్రామంలో ప్రజలు తాము తాగునీటికి పడుతున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధుల మంజూరుకు కృషి చేస్తాననన్నారు. రాయికల్​లోని ఫిల్టర్​బెడ్​ పనుల పునరుద్ధరిస్తామని చెప్పారు.