ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి

ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి
  • సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు :  ఉర్దూ టీచర్​ పోస్టుల భర్తీకి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో వాటిని జనరల్ కేటగిరీకి కేటాయించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

ప్రభుత్వం రిజర్వేషన్ల ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉర్దూ మీడియంలోని పోస్టులను కేటాయించిందని.. దశాబ్దాకాలంగా ఆ కేటగిరీల నుంచి అభ్యర్థులు లేరని చెప్పారు. అర్హులైన అభ్యర్థులున్నప్పటికి జనరల్ కేటగిరీ వారికీ కేటాయించకపోవడంతో తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉర్దూ స్కూల్స్ లోని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన చేయని పరిస్థితి నెలకొందని లేఖలో పేర్కొన్నారు.