రాబోయే రోజుల్లో స్విగ్గీ, జోమాటోలాగే ఆన్ లైన్ లో బుక్ చేస్తే మద్యం ఇంటికి వచ్చేలాగా తెలంగాణలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని.. ఇది కేవలం కేసీఆర్ బ్రాండ్ కే దక్కుతుందన్నారు.
ప్రభుత్వం పేదప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలను దోచుకుంటూ.. మద్యం తాగే వాళ్ళ పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. మద్యంతో సమాజాన్ని బానిసలు చెయ్యొద్దని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కార్ కు ఆదాయాన్ని తెచ్చేందుకే ఊరికో బెల్టు షాప్ పెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. సమాజాన్ని మద్యానికి బానిసలు చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య ఆలోచనా విధానామని జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.