బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక ఆర్డినెన్స్ ఇవ్వండి

బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక ఆర్డినెన్స్ ఇవ్వండి
  • ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎలక్షన్​లో  బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సామాజిక వెనకబాటుకు గురవుతున్న బలహీన వర్గాలకు  జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలంటే..రాజ్యాంగాన్ని సవరించాల్సిందేనని చెప్పారు. గురువారం సీఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పుకు తెలంగాణ ప్రభుత్వం కట్టబడి ఉందని తెలిపారు. దేశంలో వర్గీకరణపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణేనని గుర్తుచేశారు. 

రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు, రెండు నెలల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించడం అభినందనీయమన్నారు. యూపీఏ హయాంలో వేసిన ఉషా మెహ్రా కమిషన్​కు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇందులో ఎన్డీఏ పాత్ర లేదని వివరించారు.  భవిషత్తులో  చేపట్టే అన్ని రకాల నియామకాల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, దీనిపై ఎస్సీలు ఆందోళన వద్దని ఆయన పేర్కొన్నారు.