జగిత్యాల రూరల్, వెలుగు: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని పలువురు రిసోర్స్‌పర్సన్లు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుKarతూ ఆర్పీలకు పెండింగ్వేతనాలతోపాటు రూ.10 వేల గౌరవవేతనం అందేలా చూస్తామన్నారు.
రాయికల్, వెలుగు: గతంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ మండలం అయోధ్య, రాజనగరం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ముందుగా అయోధ్య రామాలయంలో పూజలు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. రామాలయ రోడ్డు నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. పీఆర్ డీఈ మిలింద్, లీడర్లు గోపి రాజరెడ్డి, మండ రమేశ్, సుదర్శన్‌రెడ్డి, వినోద్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.