రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ చేశారు. 2022 లో ఒక్క ట్రాన్స్ ఫార్మర్ అయినా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిందా అని సీఎం కేసీఆర్ ను నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధితోనే జగిత్యాలకు గుర్తింపు వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేసుకుంటామని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు మంత్రి కొప్పుల ఈశ్వర్ ముక్కును నేలకు రాపిస్తారన్నారు. జూన్ 22న దశాబ్ద దగా పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.