జగిత్యాల జిల్లా : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దళిత బంధు పథకం ఎమ్మెల్యే బంధుగా మారిందని ఆరోపించారు. అర్హులకు మొండి చేయి చూపించి టీఆర్ఎస్ వారికే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ నిధులను వెంటనే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల అర్హత కటాఫ్ జీవోను అమలు చేయాలని కోరారు.