వీ6 మీడియాకు అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నా: ఎమ్మెల్సీ జీవన్ ‌‌రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికే కొత్త సెక్రటేరియట్​ నిర్మించారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కొత్త  సెక్రటేరియట్ ‌‌కు అంబేద్కర్​ పేరు పెట్టారని ఆరోపించారు. సోమవారం జగిత్యాలలో ఎమ్మెల్సీ వీ6 మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడిన వీ6, వెలుగుకు సెక్రటేరియట్ ‌‌లోకి అనుమతించకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా పలు పేపర్లలో ప్రకటనల కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. సీఎం ఇప్పటికైనా కొత్త సెక్రటేరియట్ ‌‌లో ప్రజలకు అందుబాటులో ఉండి పాలన కొనసాగించాలని అప్పుడే అంబేద్కర్ పేరుకు సార్థకమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ ‌‌రెడ్డి సూచించారు.