ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరం

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగస్తురాలు భర్తను కోల్పోతే వితంతురాలు కాదా? 317 జీవోలో ప్రాధాన్యత ఇదేనా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘ఒంటరి మహిళలకు స్థానికత లేకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. గతంలో తెచ్చిన ఆర్టికల్ 371 (d)ని యథావిధిగా కొనసాగిస్తూ కేటాయింపులు చేయాలి. ఉద్యోగ నియామకాలతో పాటు కొనసాగింపును కూడా ఆర్టికల్ 371(d) పర్యవేక్షస్తుంది. ఉద్యోగి పదవి విరమణ పొందే వరకు 371 డీ ఆర్టికల్ స్థానికతను పరిరక్షిస్తుంది. ఈ విషయం ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరం. మలి దశ ఉద్యమానికి అడుగులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగ నియామకాలు, హక్కుల పరిరక్షణ,  సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఉద్యమ బాటలు పడతాయి. దానికి కేసీఆర్ జవాబు దారుడు అవుతాడు. ఇప్పటికైనా 317 జీవోనూ ఉపసంహరించండి. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు అఖిల పక్షాన్ని, యువతను భాగస్వామ్యం చేసి సమావేశం ఏర్పాటు చేయండి. నూతన కేటాయింపు ప్రక్రియ ఉద్యోగం పొందిన నాటి విధానాలతోనే చేయాలి’ అని జీవన్ రెడ్డి అన్నారు.
 

For More News..

యాదాద్రికి భారీ విరాళమిచ్చిన హెటిరో

హైదరాబాద్ కు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా