జగిత్యాల టౌన్, వెలుగు: షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి నాటి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత మాట తప్పారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. షుగర్‌ఫ్యాక్టరీ రీఓపెనింగ్విషయమై ప్రభుత్వం కమిటీ వేసిన నేపథ్యంలో సోమవారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా కమిటీ వేసినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు.
ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే రెండు అమలు చేశామని గుర్తు చేసారు. గతంలో కేసీఆర్కనీసం మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సీఎం ను కలిసి సమస్యలపై చర్చిస్తున్నామన్నారు.