
రబీ సాగు నీటి సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సాగు నీటి సమస్యకు నైతికంగా బీఆర్ఎస్ నాయకులు బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు తడి ఆరిపోకుండా.. చివరి వరకు పంటలను కాపాడాలని ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా నీరు విడుదల చేస్తోందని ఆయన చెప్పారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రైతులు ఆందోళన చెందేలా హరీష్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నుండి ఎప్పుడైనా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించారా అని హరీష్ రావును ప్రశ్నించారు.
Also Read: గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
ఐదేళ్లు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ చేయలేదని మండిపడ్డారు జీవన్ రెడ్డి. రుణాలకు సంభందించి నోటీసులు ఇస్తున్నారంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని... రైతులు పంట రుణాల చెల్లింపులపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. పంట నష్ట పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందిస్తామని చెప్పారు. ఐదేళ్లలో ఎమీ చేయని ఎంపీ అరవింద్ మరోసారి ఎన్నికల్లో ఓటు వేయాలని అడుగుతున్నాడని విమర్శించారు. చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభించే బాధ్యత తనదేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.