ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా పట్టణంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు. గతంలో క్వీన్ ఎలిజబెత్ ఉండేదని.. ఇప్పుడు లిక్కర్ క్వీన్ కవిత వచ్చిందని ఎద్దేవా చేశారు.
Also Read :- కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయం
బిఆర్ఎస్ సర్కారు వస్తే బతుకమ్మ మీద గౌరమ్మకు బదులు లిక్కర్ బాటిల్ పెడుతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసే అర్హత లిక్కర్ క్వీన్ కవితకు లేదన్నారు. గతంలో ఐదు ఏళ్లు ఎంపిగా ఉన్న కవిత.. ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ మూపించిన ఘనత కవితకే దక్కుతుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.