జగిత్యాల రూరల్, వెలుగు: పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి రూ.లక్షల కోట్ల అప్పని, అంతకుముందున్న సర్కార్లు అన్నీ కలిసి చేసిన అప్పు కన్నా ఈ పదేళ్లలో చేసిన అప్పు నాలుగింతలైందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీహార్ రాష్ట్ర బడ్జెట్‌గా ఉందన్నారు.
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం విప్ అడ్లూరి మాట్లాడుతూ మోదీ పాలనలో ఎక్కడ ఎన్నికలుంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. నిధుల కేటాయింపుల్లో వివక్షపై జగిత్యాలలో ఫిబ్రవరి 3న నిరసన చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రాజేందర్, నందయ్య, శంకర్,దుర్గయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రాయికల్, వెలుగు: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడల అభివృద్దికి కట్టుడి పని చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలోని సాడే భీంరెడ్డి క్రీడా మైదానంలో జరిగిన రాయికల్ క్రికెట్లీగ్ పోటీల్లో గెలిచిన కాటిపెల్లి రాంరెడ్డి టీంకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆదివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్రికెట్ జట్ల యాజమానులు ఎద్దండి దివాకర్‌రెడ్డి, మ్యాకల రమేశ్, కొయ్యడి మహిపాల్, ఎలిగేటి అనిల్, కాటిపెల్లి రాంరెడ్డి, ధర్మపురి, నాగరాజు, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.