జగిత్యాల, వెలుగు : రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. గతంలో చెప్పినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీస్‌రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. వరి మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 65 సీట్లతో సుస్థిర ప్రభుత్వం ఉందని ఎవర్ని చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కనుమరుగైన బీఆర్‌ఎస్ గురించి తాము ఆలోచన చేయబోమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.