జగిత్యాల టౌన్, వెలుగు : రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్దని, గ్రీవెన్స్‌లో అప్లై చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. బుధవారం జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆధార్ మిస్ మ్యాచ్, పేర్లలో తప్పులు వంటి సాంకేతిక సమస్యలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని
వాటిని సరిచేయగానే వర్తింపజేస్తామన్నారు. రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ చేస్తామని, అయితే పైచిలుకు మొత్తాన్ని ముందుగా చెల్లించాలని సూచించారు. విపక్షాలు విమర్శలు మాని రైతులను గైడ్ చేయాలని హితవు పలికారు.