జగిత్యాల టౌన్, వెలుగు : ఓల్డ్ పెన్షన్ స్కీం అమలుకు కృషి చేయడంతోపాటు జోనల్ విధానంపై సమీక్షిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పీఆర్టీయూ సంఘం క్యాలెండర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విశ్రాంత జీవితానికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జోన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి
ప్రధాన కార్యదర్శి ఆనందరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చంద్ర ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను జీవన్‌రెడ్డి ఆవిష్కరించారు. అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు కె.తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.