317GO సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • ఇంగ్లీష్ మీడియా స్టార్ట్ చేయాలంటే ఫిబ్రవరిలోనే టీచర్ల నియామకాలు పూర్తి చేయాలి

జగిత్యాల: జీవో 317 ద్వారా తలెత్తిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలంటే.. ముందుగా వచ్చే ఫిబ్రవరిలోనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఆదివారం  జగిత్యాల ఇందిరా భవన్ లో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ లను  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో డిటిఎఫ్ పాత్ర కీలకం అని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తే  ఫిబ్రవరి నెలలోనే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 

ఇవి కూడా చదవండి

కొండా వర్సెస్ చల్లా.. మాటల యుద్ధం

మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం