ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు: ప్రజా ఆస్తుల పరిరక్షణే తన ధ్యేయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల రూరల్ నర్సింగాపూర్ గ్రామంలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 437, 251లోని లోని వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను గతంలో కొందరు అనర్హులు పట్టా చేయించుకున్నారన్నారు.

ఈ విషయమై గతేడాది కలెక్టర్ కు లేఖ రాయగా, ఆయన విచారించి సర్వేనెం 437 లో 90 ఎకరాలు అనర్హులకు అందించినట్లు గుర్తించి అసైన్మెంట్ భూమితోపాటు మొత్తం 90 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ భూములను గ్రామంలోని పేదలు, బలహీన వర్గాలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు సర్వే నం 251 కు సంబంధించిన అక్రమ పట్టాలు రద్దుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బండ శంకర్, దుర్గయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

రాయికల్ పథకానికి రూ.4.97 కోట్లు

రాయికల్, వెలుగు:  జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు శుద్ధ జలం అందించాలనే ఉద్దేశంతో ఫిల్టర్ బెడ్ రిపేర్లకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశాలతో రూ. 14 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకం రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను పరిశీలించారు.

అనంతరం రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందలేదన్నారు. రాయికల్ ఫిల్టర్ బెడ్ కు రూ.4.97 కోట్లు మంజూరు చేయించామని ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు.