అప్పు తేకుండా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర మాది

అప్పు లేకుండా కేసీఆర్ ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 8 ఏళ్లలో కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. దేశ సంపదను మోడీ అంబానీ, అదానీలకు దోచిపెడుతుంటే..కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారన్నారు. క్రూడాయిల్ ధర పెరగకపోయినా ఇంధన ధరలు ఎందుకు పెంచారో చెప్పాలన్నారు.  బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. ఒక్క రూపాయి కూడా అప్పు తేకుండా పోచంపాడు, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్మించిన చరిత్ర తమదన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందన్నారు. హైదరాబాద్ లోని విలువైన భూములు అమ్మినట్లుగానే.. జిల్లా కేంద్రాల్లోని భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుంన్నారు. తెలంగాణ వచ్చాకే  మూడు నిజాం చక్కెర ఫ్యాక్టరీలు మూసివేశారన్నారు. 

ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ ధర్నా