కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టంలో లొగులు ఉపయోగించి ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్లు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన AICC చీఫ్ ఖర్గేకు లేఖ రాశారు. జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య గురించి కూడా లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కొందరు బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని హైకమాండ్ ను కోరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీనే అన్నారని ఆయన వివరించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాడని ఆయన గుర్తు చేశారు. ఆయన శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ తరుపున పదేళ్లపాటు ఒంటరిగా ఎదుర్కొన్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలపై ఎనలేని పోరాటం చేశానని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీలో తన గౌరవాన్ని కాపాడుతానని కాంగ్రెస్ పార్టీ లీడర్లు హామి ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో గుర్తు చేశారు.