సోనియమ్మకు ప్రజలు రుణపడి ఉంటారు: జీవన్ రెడ్డి

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనను సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎందుకు సాధించుకోలేదని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జీవన్ రడ్డి.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలని చెప్పారు. 


విభజన హామీలపై ప్రధాని మోడీని ఎందుకు అడగలేకపోయారు అంటూ జీవన్ రెడ్డి నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విషబీజాలు నాటేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ,ఏపీ మళ్లీ కలవాలనే తాను కోరుకుంటున్నాను అన్న  సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ కలవాలని మాట్లాడటం.. వైసీపీ పాలన వైఫల్యమే అని జీవన్ రెడ్డి విమర్శించారు.