హోదా మరచి మోదీ దిగజారి మాట్లాడారు : కడియం 

జనగామ జిల్లా : ఇందూరు బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజకీయం కోసం మోదీ ఇంతలా దిగజారి మాట్లాడుతారని అనుకోలేదన్నారు. యావత్ సమాజాన్ని అగౌరవ పరిచే విధంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. యావత్ తెలంగాణ మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని చెప్పారు. పీయం, సీఎం కాన్ఫిడెన్షియల్ విషయాలను పబ్లిక్ గా చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. ఒక వ్యక్తిని ప్రధాని ముఖ్యమంత్రిగా చేసే వ్యవస్థ మన దేశంలో లేదన్నారు. ఈ విషయంలో మోదీ జ్ఞానం పరిధి ఏంటో అర్థమవుతోందన్నారు. తెలంగాణను అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

ALSO READ : భగవంత్ కేసరి నుంచి.. ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ రిలీజ్

విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, వాటిని ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తొమ్మిదేళ్లలో తెలంగాణకు చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించడానికి పదేళ్లు అవసరమా..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అవసరమా..? అని ప్రశ్నించారు. దళిత, మైనార్టీ వ్యతిరేక విధానం అవలంబించిన బీజేపీ తెలంగాణలో అవసరమా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని చెప్పారు.