జగన్ జైలుకు...షర్మిలకు పదవి : కడియం శ్రీహరి

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వైఎస్ కుటుంబం తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమేనని చెప్పారు. పాదయాత్ర చేసి అన్నను సీఎంను చేసిన షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలతో మొర పెట్టుకోవాలని సూచించారు. జగన్ గ్రాఫ్ పడిపోతోందని, రేపో మాపో ఆయన జైలుకు వెళ్తే షర్మిలకు పదవి దక్కే అవకాశముందని అన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ షర్మిల సమయాన్ని వృథా చేసుకోవద్దని కడియం సూచించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఒరిగిందేమీ లేదు అన్న క‌డియం.. రాష్ట్ర  బ‌డ్జెట్ సంక్షేమ బ‌డ్జెట్ అని ప్రశంసించారు.