సంక్రాంతి పోయినా.. సన్న బియ్యం ఇయ్యలే.. : కవిత

సంక్రాంతి పోయినా.. సన్న బియ్యం ఇయ్యలే.. : కవిత
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : సంక్రాంతి పోయినా సన్న బియ్యం ఇస్తలేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో బుధవారం మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరుతో బుల్‌‌‌‌డోజర్లు పెట్టి పేదల ఇండ్లను కూల్చివేస్తున్నార్ననారు. మూసీ పేరుతో రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్‌‌‌‌ ఢిల్లీకి డబ్బులు పంపే కుట్ర చేస్తోందని  ఆరోపించారు. గతంలో మాదిరిగా అందరికీ రైతు భరోసా, ఇండ్లు ఇవ్వాలని లేదంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. 

కృష్ణా నదిలో వాటాను కాపాడుకోవడంలో సర్కారు విఫలమైందన్నారు. తమ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ. 36 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఆమె వెంట కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌‌‌రెడ్డి, బూడిద భిక్షమయ్య, క్యామ మల్లేశ్‌‌‌‌ ఉన్నారు.

నారసింహుడిని దర్శించుకున్న కవిత

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి వారిని బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు, భక్తులతో కలిసి గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం కాలినడకన కొండపైకి వచ్చిన కవితకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వనం చేయగా, ఈవో భాస్కర్‌‌‌‌రావు స్వామి వారి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు, నారసింహుడి ఫొటోను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

నారసింహుడే కేసీఆర్‌‌‌‌తో గుడి కట్టించుకున్నాడని, రూ.1200 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని ‘టెంపుల్‌‌‌‌ సిటీ ఆఫ్‌‌‌‌ ది నేషన్‌‌‌‌’గా తీర్చిదిద్దారని కొనియాడారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు పాపట్ల నరహరి, గడ్డమీది రవీందర్‌‌‌‌గౌడ్‌‌‌‌, తోటకూరి అనురాధ, కసావు శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ ఉన్నారు.