ఎడపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ : కల్వకుంట్ల కవిత

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లిలో విభిన్నంగా దసరా తర్వాత నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలు పేర్చి, పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడుతూ అందరిని అలరించారు. అనంతరం స్థానిక రామమఠంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి దేశ్​ముఖ్ గడీలో, హనుమాన్ మందిరం వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మల ఊరేగింపులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహ్మద్​షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, ఎడపల్లి సర్పంచ్​ఆకుల మాధవి, జడ్పీ వైస్​చైర్​పర్సన్​ రజిత​ తదితరులు పాల్గొన్నారు.