- తెలంగాణపై మోదీ కక్షగట్టారు
- గవర్నర్లను అడ్డం పెట్టుకొని సీఎంలను ఇబ్బంది పెడుతున్నరు: కవిత
హైదరాబాద్, వెలుగు : తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ కక్ష గట్టారని, తొమ్మిదిన్నరేండ్లుగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని, రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా పదే పదే మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీకి తెలంగాణ ప్రజలతో ఆత్మబంధం లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిస్తున్నది. కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మరు” అని అన్నారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీ, బీసీ నాయకులను కేబినెట్ రికమండ్చేస్తే గవర్నర్తిరస్కరించారని, రాజ్యాంగబద్ధమైన సంప్రదాయాలను పాటించకుండా గవర్నర్ తిరస్కరించారని ఆమె దుయ్యబట్టారు. ‘‘రాజకీయ కారణాలతో గవర్నర్లను అడ్డం పెట్టుకొని ఇబ్బందులకు గురిచేయడం తగదు. గవర్నర్లను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడతున్నరు. ఈ చర్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం” అని పేర్కొన్నారు.