- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఆర్మూర్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లు సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి మూడోసారి ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖారారైన తర్వాత మొదటిసారి ఆర్మూర్ కు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ర్యాలీ కి కవిత అటెండ్ అయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండెట్లను డిక్లేర్చేయగా, బీజేపీ, కాంగ్రెస్ లకు అభ్యర్థులు కరవయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలో సీఎం స్థాయి నేత కూడా లేరన్నారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి మార గంగారెడ్డి, ఆకుల లలిత, దాదన్నగారి విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.