నిజాంసాగర్(ఎల్లారెడ్డి) , వెలుగు : మళ్లీ అధికారంలోకి తామే వస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్నియోజక వర్గంలో కొత్తగా ఏర్పాటుచేసిన మహ్మద్‌నగర్ మండలాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే హన్మంతు షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభ, ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ జితేష్ వి పాటిల్‌లతో కలిసి కవిత ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ స్కీమ్ అందని ఇల్లు లేదన్నారు. ఎన్నికలు వస్తే ఇతర పార్టీల లీడర్లు వచ్చి మాటలు చెబుతారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆగం కావొద్దన్నారు. ఇప్పుడిప్పుడే తెలివికొస్తున్న తెలంగాణను తెర్లు చేసుకోవద్దన్నారు.
- ALSO READ| సీఎం ఆశీస్సులతో కామారెడ్డికి వేలకోట్ల నిధులు