తల్వార్ తో బర్త్ డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ కౌశిక్

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బర్త్ డే సందర్భంగా నేతలు హంగామా చేశారు. డీజే సౌండ్స్, బ్యాండ్ మేళాల నడుమ రోడ్లపై డ్యాన్స్ లు చేశారు. తమ అభిమాన నాయకుడికి బర్త్ డే సందర్భంగా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. హుజురాబాద్ చౌరస్తాకు చేరుకున్న కౌశిక్ రెడ్డికి అభిమానులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

జేసీబీతో భారీ గులాబీ మాల వేశారు. అక్కడనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కౌశిక్ రెడ్డి పూలమాల వేసి నివాళలర్పించారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. తల్వార్ లతో  నృత్యాలు చేశారు. వేదికపై చేరుకున్న కౌశిక్ ను పలువురు సన్మానించారు. అప్పటికే ఏర్పాటు చేసిన 38 కిలోల బర్త్ డే కేక్ ను తల్వార్ తో కౌశిక్ కట్ చేశారు.