కౌశిక్​రెడ్డిని బర్తరఫ్​ చేయాలి : తిప్పరవేణి లక్ష్మణ్​

  • ఉమ్మడి జిల్లాలో ముదిరాజ్​ల నిరసనలు

కోరుట్ల, వెలుగు: ముదిరాజ్‌లను కించపరుస్తూ కామెంట్​చేసిన  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.. తన పదవికి రాజీనామా చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని ముదిరాజ్​ సంఘ సభ్యులు డిమాండ్ ​చేశారు. మంగళవారం కోరుట్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్​ చౌరస్తాలో ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 కరీంనగర్  టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే  బర్తరఫ్ చేయాలని  రాంనగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తిప్పరవేణి లక్ష్మణ్​  డిమాండ్ చేశారు.  కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు  నిరసనగా మంగళవారం కరీంనగర్ ​రాంనగర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకుడు మెన్నేని రోహిత్ రావు మద్దతు తెలిపారు. సంఘం లీడర్లు తిరుపతి, సంపత్, నాగప్రసాద్, హరీశ్‌, కనకయ్య పాల్గొన్నారు.