కేసులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం: ఎమ్మెల్సీ క‌విత

కేసులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం: ఎమ్మెల్సీ క‌విత

కామారెడ్డి : హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ లేకపోవడం వల్లే బోధన ఘటనలో విద్యార్థి వెంకట్ చనిపోయాడని ఎమ్మెల్సీ క‌విత  అన్నారు. వెంకట్​కుటంబసభ్యులను గాంధారి మండలం తిప్పారం గ్రామంలో ఆమె పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  హర్యల వెంకట్ బోధన్ హాస్టల్‌లో జరిగిన ఘర్షణలో మృతి చెందడం  బాధాకరమన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు  నమోదు కావడం వల్ల  వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిప‌డ్డారు.

ALSO READ :- మోదీ ప్రభుత్వంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్

రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్ల  ఘటన జరిగిందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం  దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో వాచ్‌మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్‌ని నియమించాలని జిల్లా కలెక్టర్‌ను కోరామ‌న్నారు. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.