ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్

ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్
  • సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ జాగృతి ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: నిజామాబాద్​ఎంపీ అర్వింద్ అనుచరులు ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్​చేసి సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి, ఓయూ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. ఓ మహిళా ప్రజాప్రతినిధి ఫొటోలను మార్ఫింగ్​చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సైబర్ క్రైం పోలీసులు స్పందించకుంటే కోర్టుకెళ్తామని చెప్పారు. ఎంపీ అర్వింద్​చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు.