హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌లో ప్రారంభించనున్న ఐటీ హబ్‌లో కంపెనీ స్థాపించాలని గ్లోబల్లాజిక్సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత కోరారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్గురు కమకొలను, కంటెంట్ఇంజినీరింగ్విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ వీరపల్లి సోమవారం హైదరాబాద్‌లో కవితతో భేటీ అయ్యారు.
ఐటీ హబ్‌కు ట్రాన్స్‌పోర్టు, కరెం ట్, నీటి సదుపాయాలు ఉన్నాయని, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉందని ఆమె తెలిపారు. నిజామాబాద్ఐటీ హబ్‌ను తాము మంగళవారం సందర్శిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాలిఫోర్నియా కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తోందని, హైదరాబాద్‌లో తమకు రెండు క్యాంపస్‌లు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, బీఆర్ఎస్ఎన్ఆర్ఐ సెల్ కో ఆర్డినేటర్ మహేశ్‌బిగాల పాల్గొన్నారు.