- ఢిల్లీలో రెండు రోజులుగా విచారిస్తున్న ఈడీ
- నిర్ధారించుకొని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటన
- కవితతో కలిసి మీటింగ్స్ లో పాల్గొన్న పిళ్లయ్
- ఇప్పటికే ఆయన రూ.2.25 కోట్లు విలువ చేసే ల్యాండ్ అటాచ్
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక మలుపుతిరిగింది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అరుణ్ రామచంద్రపిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది. రెండు రోజులుగా విచారించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆధారాలతో జనవరి 25న అరుణ్ పిళ్లై ఆస్తుల ఈడీ అటాచ్ చేసింది. రంగారెడ్డి జిల్లా
వట్టినాగులపల్లిలోని రూ.2.25 కోట్లు విలువ చేసే ల్యాండ్‌ను జప్తు చేసింది.
ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అరుణ్ పిళ్లై
సౌత్‌గ్రూప్‌లో ఇండో స్పిరిట్ ఎండీ సమీర్‌మహేంద్రు, ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారు. కవిత తరుపున అరుణ్ పిళ్లై మీటింగ్స్ లో పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ మార్పు ద్వారా వచ్చిన ఎల్ 1 లైసెన్సుల్లో 65% సౌత్‌గ్రూప్ కంట్రోల్‌లోకి వెళ్లింది. ఈ స్కామ్‌లో అభిషేక్‌రావు, అరుణ్‌రామచంద్ర పిళ్లై, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవరెడ్డి పాటు ఎమ్మెల్సీ కవితపై ఈడీ తీవ్రమైన అభియోగాలు మోపింది. ఛార్జ్‌షీట్‌లో సౌత్‌లాబీ వివరాలు వెల్లడించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టయ్యారు.