కేసీఆర్ ను తలవకుండా .. రేవంత్​కు రోజు గడవదు : ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ ను తలవకుండా .. రేవంత్​కు రోజు గడవదు : ఎమ్మెల్సీ కవిత
  • రాష్ట్రంలో రాబోయేది సెక్యులర్ సర్కారే ఎమ్మెల్సీ కవిత కామెంట్

​నిజామాబాద్, వెలుగు: బీఆర్ఆస్​అధినేత కేసీఆర్ ను తలవకుండా సీఎం రేవంత్​రెడ్డికి రోజు కూడా గడవదని, కలలో కూడా ఆయన పేరునే జపిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్​లో  ఆమె ఇఫ్తార్​విందుకు హాజరై మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్​రెడ్డి ప్రకటించిన స్కీమ్ లు ఒక్కొక్కటి క్లోజ్​చేస్తున్నారని విమర్శించారు.

పంటలకు సాగునీరు కూడా ఇవ్వక సోది మాటలతో టైంపాస్​ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సాధించి హిస్టరీలో నిలబడిన కేసీఆరే స్టేట్​ఫ్యూచర్​అని ఆయన బలం రోజురోజుకు పెరుగుతుందన్నారు. కేసీఆర్​మాట్లాడితే జనం టీవీల ముందు కూర్చుంటారని,  రేవంత్​రెడ్డి మాట్లాడితే టీవీలు మ్యూట్​చేస్తున్నరని ఎద్దేవా చేశారు.

ఎవరైనా తమ చేతలతో ప్రజల గౌరవం పొందుతారని, కేసీఆర్​కు రేవంత్​రెడ్డి  ఎక్కడా  సరితూగర న్నారు. రాష్ట్రంలో తిరిగి కేసీఆర్​నాయకత్వంలో సెక్యూలర్​సర్కారు రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ముస్లింలకు రంజాన్​తోఫా ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి, బీఆర్ఎస్​జిల్లా ప్రెసిడెంట్​ఆశన్నగారి జీవన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్​, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్​గుప్తా తదితరులు పాల్గొన్నారు.