పసుపు బోర్డు సరిపోదు ..రూ.15 వేలు మద్ధతు ధర ఇవ్వాలి: కవిత

పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని.. మద్ధతు ధర రూ. 15 వేలు  ఇవ్వాలన్నారు.   పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారని విమర్శించారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి  రాష్ట్ర ప్రభుత్వానికి,  స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా  కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని ధ్వజమెత్తారు.

ALSO READ | తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక.. నిజామాబాద్​లో పసుపు బోర్డు

తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటయ్యిందన్నారు కవిత.  తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్ల పసుపు  బోర్డు  ఏర్పాటయ్యిందన్నారు. ఎంపీ అర్వింద్ తన వల్లే పసుపు బోర్డు ఏర్పాటయ్యిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఎంపీ అర్వింద్ కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటన్నారు..  పసుపు దిగుమతులను నియంత్రించాలన్నారు.  ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.  జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించిందని.. అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎంపీ అర్వింద్ ను డిమాండ్ చేశారు కవిత.