
- బనకచర్ల ప్రాజెక్టును వెంటనే ఆపాలి
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అందుకే చంద్రబాబుపై ప్రేమతో రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని కృష్ణ, పెన్నా బేసిన్‌కు తరలించే బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు ప్రగతిభవన్‌లో కలిశాకే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు ప్రకటించారని తెలిపారు.
శనివారం నిజామాబాద్గంజ్మార్కెట్లో పసుపు అమ్మకాలు పరిశీలించడానికి వెళ్లిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రతిపాదన రిజెక్ట్ చేయాల్సిందేనని, లేకుంటే కోర్టుకు వెళ్లయినా ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. తనపై సీఎం రేవంత్చేస్తున్న ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాంగ్రెస్ సర్కారు పసుపు మద్దతు ధర ప్రకటించాలని కోరారు.