బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే మద్దతు ఇస్తం : ఎమ్మెల్సీ కవిత

బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే మద్దతు ఇస్తం : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్​  చేశారు. అలా చట్టం చేస్తే మద్దతు ఇస్తామని తెలిపారు. బుధవారం కవిత తన నివాసంలో మీడియాతో చిట్​చాట్​ చేశారు. 

అనంతరం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా శంఖారావం కార్యక్రమం పోస్టర్​ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే ఎవరు కోర్టుకు వెళ్లినా నష్టం ఉండదన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్​ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలన్నారు.