పదిరోజులకో ప్రాణం పోతున్నా చలనం లేదు.. ఇదేనా ప్రజాపాలన: ఎమ్మెల్సీ కవిత

పదిరోజులకో ప్రాణం పోతున్నా చలనం లేదు.. ఇదేనా ప్రజాపాలన: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు స్కూల్‌‎లో మరో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారు భవిష్యత్‌‌‌‌కోసం స్కూల్‌‌‌‌కు వెళ్లిన పిల్లలు పురుగుల అన్నం తిని కడుపు పట్టుకుని ఏడుస్తుంటే తన మనసు కలచివేస్తుందని మంగళవారం ట్విట్టర్‌‌‌‌లో పేర్కొన్నారు. ఇదే స్కూల్‌‌‌‌కు చెందిన 30 స్టూడెంట్లు ఆసుపత్రిలో చేరిన వారంలోపే.. మరోసారి ఘటన జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పదిరోజులకో పసి ప్రాణం పోతున్నా సర్కారులో చలనం లేదన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా ? అని ప్రశ్నించారు.