కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత. గురువారం ఆమె మీడియాతో చిట్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.GO 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తోంది. ఓటుకు నోటు కేసులో మీరు అప్పీల్ చేసుకోరా?.. మరి జీవో3 పై హైకోర్టు నిర్ణయాన్ని ఎందుకు సవాల్ చేయటం లేదని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ఉమెన్స్ డే రోజు నిరసన తెలిపేందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో అనుమతి ఇవ్వటం లేదని... మీరు అనుమతిచ్చినా ఇవ్వకున్నా మా నిరసన ఆగదు.. పోరాటం ఆగదు అని చెప్పారు.
మంత్రి సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని.. సీతక్కను డిప్యూటీ సీఎం చేయ్యాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఉందని ఫైర్ అయ్యారు. అలాంటి సీఎం ఉండడం మన ఖర్మ అని దుయ్యబట్టారు. ఇక, లిక్కర్ కేసుపై స్పందించిన ఆమె.. అది పెద్ద కేసు కాదన్నారు. ఆ కేసును టీవీ సీరియల్ లెక్క లాగుతున్నారు.. లిక్కర్ కేసును మా లీగల్ టీం చూసుకుంటుందని చెప్పారు. ఆ కేసులో తాను బాధితురాలినని...ఫైట్ చేస్తానని అన్నారు కవిత.