రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. రాష్ట్ర రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో యాసంగిలో ఎక్కువ శాతం బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అవుతుందని తెలిసినప్పటికీ రా రైస్ మాత్రమే కొంటామని మోడీ సర్కారు, ఎఫ్ సీఐ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. రైతులు పండించే పంట కొనకుండా బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తెలంగాణలో వ్యవసాయం గురించి బండి సంజయ్ కు ఏ మాత్రం అవగాహన లేదన్న కవిత.. రాష్ట్రంలో ఏ రైతును అడిగినా ఆయనకు జ్ఞానోదయం చేస్తారని అన్నారు. అర్థజ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

For more news..

నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్

బెలారస్‌ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు నో