ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్

ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత బెయిల్ ఇస్తూ.. ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి.. తీహార్ జైలులో ఉన్నారు కవిత. 2024, మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐ విచారణ నడుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐ విచారణ నడుస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో గంటన్నరపాటు వాదనలు సాగాయి. సెక్షన్ 45 కవితకు ఎందుకు వర్తించదు అని కవిత తరపు లాయర్లు వాదించారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని.. 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చెబుతున్న ఈడీ.. ఒక్క రూపాయి కూడా రికవరీ ఎందుకు చేయలేదని వాదించారు. కవితకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ తప్పితే.. ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఆమె తరపు వాదించిన ప్రముఖ లాయర్ ముకుల్ రోహిత్గీ

కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ ఈడీ తరపు లాయర్లు వాదించారు. కేసు విచారణలో ఉందని.. ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వటం సమంజసం కాదని వాదించారు. 

ఈడీ వాదనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెల్ ఫోన్ డేటా డిలీట్ చేయటం అనేది సహజంగా జరిగేదే కదా అంటూ వ్యాఖ్యానించింది కోర్టు. 

2024, మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ కాగా.. 153 రోజులుగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు.