జగిత్యాల జిల్లావ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మెట్పల్లిలోని మినీ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఊర్లలో, చేన్లలో పూసే తంగేడు, గునుగు పూలతో చేసుకునే పండుగే బతుకమ్మ అని కవిత అన్నారు. బతుకమ్మ సంతోషానికి ప్రతిరూపమని, పూలను చూసినా, పాటలను విన్నా సంతోషం కలుగుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్న కవిత.. బతుకమ్మ కోసం చేస్తున్న ఏర్పాట్లు, చిన్నారులు సైతం వేడుకల్లో పాల్గొనడం చూసి సంతోషం కలుగుతోందని చెప్పారు. దేశ విదేశాల్లో బతుకమ్మను జరుపుకోవడం గర్వంగా ఉందని అన్నారు.